Rohit Sharma విక్టరీ కెప్టెన్.. Kohli, Dhoni సైతం, MI మహిమ | IND vs NZ || Oneindia Telugu

2021-11-23 189

IND vs NZ T20: Rohit Sharma Doesn't Have Any Captaincy Pressure and Becomes Player Of The Series vs New Zealand in T20I Series
#INDvsNZ
#RohitSharma
#RohitSharmaPlayerOfTheSeries
#MI
#TeamIndiaSeriesWin
#VenkateshIyer
#IPL2022
#RahulDravid

భారత క్రికెట్ జట్టు దుమ్ము లేపింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఎదురైన అవమానకర పరాజయాన్ని మరిపించేలా చేసింది. అదే టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్‌ను మట్టి కరిపించింది. న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది. 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సాధారణంగా జట్టును నడిపించే బాధ్యతను తీసుకున్న ప్లేయర్.. కొంత ఒత్తిడికి గురి అవుతాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్.. కేప్టెన్‌గా ఛార్జ్ తీసుకున్న తరువాత కొంత నెర్వస్ లోనవుతుంటాడు. దాని ప్రభావం బ్యాటింగ్‌పై పడుతుంటుంది. భారీ స్కోర్లను చేయడంలో తడబాటును ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చూశాం. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సైతం ఒత్తిళ్లను ఎదుర్కొన్న మ్యాచ్‌లు చాలా ఉన్నాయి.